ఐరాస కమిటీలో ఆంధ్ర వైవిరెడ్డి

Y Venugopal Reddy
ఐరాస: ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు సూచించేందుకు ఐక్య రాజ్య సమితి(ఐరాస) నియమించిన ఓ ఉన్నతస్థాయి కమిటీలో ఆంధ్రుడు, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ వై.వేణుగోపాల్‌ రెడ్డికి చోటు దక్కింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు మిగూల్‌ ఎస్కాటో ఈ కమిటీని నియమించారు. నోబెల్‌ బహుమతి గ్రహీత (2001), ప్రపంచబ్యాంకు మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు జోసెఫ్‌ స్టిగ్లిట్జ్‌ అధ్యక్షుడిగా వ్యవహరించే ఈ కమిటీలో వై.వి.రెడ్డి సహా పదిమంది సభ్యులు ఉంటారు.

ఐరాస సభ్యదేశాల ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు అవసరమైన సలహాలను ఈ కమిటీ ఇస్తుంది. ఐరాస ప్రతినిధి ఎన్‌రిక్‌ ఈవ్స్‌ శుక్రవారం ఈ మేరకు వెల్లడించారు. ఈ ఉన్నతస్థాయి ఆర్థిక నిపుణుల కమిటీలో బార్బడోస్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన అవినాష్‌ ప్రసాద్‌ కూడా ఉన్నారు. ఈయన ఇంటెలిజెన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ (ఎల్‌ఎస్‌ఈ) సభ్యుడు కూడా. కమిటీలోని ఇతర సభ్యుల్లో జెటీ అక్తర్‌ అజీజ్‌(మలేషియా), చుకుమా సొలుడో (నైజీరియా), యూ యాంగ్‌డింగ్‌ (చైనా), జోస్‌ ఆంటోనియో ఒకాంపో (కొలంబియా), ఇసూకే సకాకీబరా (జపాన్‌), జీన్‌ పాల్‌ ఫిటోసీ (ఫ్రాన్స్‌), ఐరాస ప్రతినిధిగా జోమో క్వామే సుందరంలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+