పార్టీలు ప్రైవేట్ కంపెనీలు: జెపి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ప్రైవేటు కంపెనీలుగా మారిపోయాయని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాణ్ అన్నారు. రాజకీయ పార్టీలను ప్రజాస్వామీకరించుకోవాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మంచివాళ్లు రాజకీయాల్లోకి రావాలని ఆయన అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను ప్రజలే ఎంపిక చేసుకునే ప్రక్రియ ఉండాలని ఆయన అన్నారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలతో రాజకీయాలు చేసే అవాంఛనీయ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని ఆయన అన్నారు.
రాజకీయాలు అవినీతిని పెంచి పోషిస్తున్నాయని ఆయన అన్నారు. విలువలు కలిగినవారు, సమర్థులు, మంచివాళ్లు రాజకీయ నాయకత్వం చేపట్టే పరిస్థితి రావాలని ఆయన అన్నారు. అటువంటి రాజకీయాలు సాధ్యమేనని ఆయన అన్నారు. అందరి మనస్సులో అదే ఉందని, అయితే అందుకు అందరూ పూనుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications