మహారాష్ట్రవి అక్రమ ప్రాజెక్టులు: టిడిపి
నిజామాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం చెక్ డ్యాంల పేరుతో గోదావరి నదిపై భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. తమ పార్టీ నేతలు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి తదితరులతో కలిసి ఆయన గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. కేంద్ర జల సంఘం, తదితర అనుమతులు లేకుండానే మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆయన అన్నారు.
తమ పర్యటనకు మహారాష్ట్ర అధికారులు, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించడంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications