పార్టీ అధిష్ఠానంపై మారెప్ప నిప్పులు

D Srinivas
కర్నూలు: మార్కెటింగ్ శాఖ మంత్రి మూలింటి మారెప్ప కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే బిచ్చగాడి చేతిలో భగవద్గీతను పెట్టడమేనని వ్యాఖ్యానించి ఆయన తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తీవ్రంగా ప్రతిస్పందించారు. మారెప్పపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మారెప్ప పార్టీ అధిష్ఠాన వర్గంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెసు పార్టీలో పులులదే పెత్తనమని ఆయన అన్నారు. తమ లాంటి మేకలను బలి ఇవ్వటమే పార్టీ అధిష్ఠానవర్గానికి తెలుసునని ఆయన మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాలలో మీడియా ప్రతినిదుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇలాగైతే పార్టీ నాయకత్వంపై అణగారిన కులాలు తిరుగుబాటు చేయక తప్పదని అన్నారు.

తాను తాగుతానని, వాగుతానని అన్న వామపక్షనేతలపై మంత్రి మారెప్ప తీవ్రంగా ధ్వజమెత్తారు. వాళ్లు తననెప్పుడైనా విందులకు ఆహ్వానించారా? తాను తాగటం చూశారా అన్నారు. తన దగ్గరకు పనులకు వచ్చిన వాళ్లు తననే విమర్శించేపాటి వాళ్లా అని జూలకంటి రంగారెడ్డి, చాడ వెంకటరెడ్డిల సంగతి తనకు తెలియదా? లెటర్‌ప్యాడ్లు అమ్ముకుని బతికే రకాలు తనకు చెప్పొచ్చారా అని మారెప్ప మండిపడ్డారు. తనను అనటం కాదు దమ్ముంటే ఇష్టారాజ్యంగా మాట్లాడే మంత్రి జేసీని విమర్శించాలని వామపక్షాలను సవాలు చేశారు. రాయలసీమ పౌరుషాన్ని ప్రతిబింబిస్తూ మీసం మెలేసి తొడ గొట్టానని చిరంజీవి అంటున్నారని గుంటూరులో ముఠా మేస్త్రీడైలాగులు, చిలకలూరిపేటలో చిలుకా క్షేమమా అనే పాటలు పాడతారా అని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+