రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనం డిచ్ పల్లి మండలం బీబీపూర్ తండా వద్ద చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిని తొలుత నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించారు.
హైదరాబాదు నుంచి నిజామాబాద్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న క్వాలిస్ వాహనం చెట్టును ఢీకొట్టింది. మృతుల్లో నిజామాబాద్ కార్పోరేటర్ హమీద్ కూడా ఉన్నారు. ఒక మహిళ, ముగ్గురు చిన్నారులు మరణించినవారిలో ఉన్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications