తాతకు దగ్గులు నేర్పుతారా: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తాతకు దగ్గులు నేర్పుతారా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన విద్యుత్ సంస్కరణల వల్లనే ఈ రోజు ప్రభుత్వం విద్యుత్తును సరఫరా చేయగలుగుతోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 12 వేల కోట్ల రూపాయలతో ట్రాన్స్ మిషన్ లోపాలను, దొంగతనాలను అరికట్టగలిగామని, రైతులకు 19 వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చామని ఆయన చెప్పారు.

తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన 2 వేల మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యచ్ఛక్తి కేంద్రాలు పని చేయడం లేదని ముఖ్యమంత్రి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ విద్యుచ్ఛక్తి కేంద్రాలకు గ్యాస్ అందిస్తామని గెయిల్, ఒఎన్జీసి హామీ ఇచ్చాయని, ప్రస్తుత ప్రభుత్వం గ్యాస్ కోసం వాటిపై ఒత్తిడి తేలేకపోతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి చేతగాక తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+