హైదరాబాదులో ఉగ్రవాద కాల్పులు

హైదరాబాద్: హైదరాబాదులో పట్టపగలే దారుణం జరిగింది. హైదరాబాదులోని సంతోష్ నగర్ లో వికార్ అహ్మద్ అనే ఉగ్రవాది కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయాడు. అతనితో పాటు మరో నలుగురు కూడా పారిపోయారు. వికార్ అహ్మద్ ను సిమి కార్యకర్తగా అనుమానిస్తున్నారు. అతను ఐఎస్ఐ ఏజెంటుగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

వికార్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో రామరాజు అనే హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. అతనితో పాటు జాఫర్ అనే పోలీసులు కూడా గాయపడ్డారు. ముంబై దాడులు తర్వాత వికారుద్దీన్ హైదరాబాదు చేరుకున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు అతని కోసం వచ్చారు. ఈ సమయంలో సంతోష్ నగర్ ఇనుప సామాన్ల దుకాణం వద్ద పోలీసులను చూసి వికార్ కాల్పులు జరిపాడు. హైదరాబాదులో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+