రోడ్ షోలపై స్టే ఎత్తివేతకు నో
హైదరాబాద్: రాజకీయ పార్టీల నేతలు నిర్వహించే రోడ్ షోలను నిషేదిస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రోడ్‌షోలపై గతంలో కోర్టు విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు వివిధ రాజకీయ పార్టీలు దాఖలు చేసిన విషయం తెల్సిందే.
రాజకీయ పార్టీల రోడ్‌షోలపై నిర్వహణపై స్టేను తొలగించాలని 'అభిప్రాయ్' అనే స్వచ్ఛంధ సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేసింది. వీటిపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వాద ప్రతివాదనలు విన్న ధర్మాసనం స్టే ఎత్తివేతకు నిరాకరిస్తూ, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు రోడ్‌షోలను మరింత ఉద్ధృతం చేసిన విషయం తెల్సిందే. ఈషోల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ కడపకు చెందిన ఒక స్వచ్ఛంధ సంస్థ పిల్ దాఖలు చేయగా, దీనిపై విచారణ జరిపిన కోర్టు రోడ్‌షోలపై స్టే విధించింది.












Click it and Unblock the Notifications