నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు: షబ్బీర్‌అలీ
హైదరాబాద్: రైతులు ఎక్కడా అసంతృప్తిగా లేరని అన్నారు. ఉన్నారని... పంటలు ఎండిపోయాయని మీరు అంటే పదండి... మీతోపాటు వస్తాను... ఎక్కడ ఎండిపోయాయో చూపండి అని షబ్బీర్‌అలీ అన్నారు. అసత్యాలు మాట్లాడటం మానాలన్నారు.
అలాగే ఏదో ఒకటి మాట్లాడాలని నోటికి వచ్చినట్లు అనటం సరికాదని... తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం బాగోలేదని విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. తానేం అనకముందే విపక్షాలు తమపై ఒంటికాలిపై లేస్తున్నాయని అన్నారు. ఉచిత విద్యుత్తు ఇవ్వటం కుదరదని, ఇస్తే దివాళా తీస్తామని, వ్యవసాయం దండుగని అన్న చంద్రబాబునాయుడుకు ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.
అయినా సమాధానం ఇచ్చేందుకు తాము సిద్ధమని అన్నారు. వానలు లేక పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే వారు రైతులపై కేసులు పెట్టారని తాము వచ్చాక అవన్నీ ఎత్తివేసి ఉచితంగా కరెంటు ఇచ్చామని అన్నారు.












Click it and Unblock the Notifications