వాస్తవాలు వినాలని ఉందా? వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: కరెంటు కొరత తీవ్రంగా ఉందంటూ సభలో ప్రభుత్వంపై థ్వజమెత్తిన టీడీపీ సభనుంచి ఇతర విపక్షాలతో కలిసి వాకౌట్‌ చేసింది. అనంతరం సీఎం సమాధానం ఇస్తుండటంతో టీడీపీ సభ్యుడు నాగం జనార్థనరెడ్డి తదితరులు తిరిగి వచ్చారు. వారిని చూసి సీఎం నా మాటలను స్వయంగా వింటే బాగుంటుందని నాగం తిరిగి వచ్చారు... సంతోషం...అందరికీ స్వాగతం అన్నారు. రాష్ట్రంలో కరెంటు కొరత రాకూడదని 6,500 కోట్ల రూపాయలు కేవలం కరెంటు కొనేందుకే వాడుతున్నామని సీఎం అన్నారు.

కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కరెంటు దొరికినా కొని రైతులకు ఇస్తున్నామని అన్నారు. ఉచిత కరెంటు ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అన్నారని వ్యాఖ్యానించారు. అందుకు టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయగా మీరు అనలేదా అని సీఎం తిరిగి ప్రశ్నించారు. మామను వెన్నుపోటు పొడవటమేకాదు యావత్తు రాష్ట్ర ప్రజలకు టీడీపీ బాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. కడపకు విద్యుత్తు ఎక్కువ ఇచ్చారని బాబు కొంతసేపటి క్రితం అన్నారని, సొంత నియోజకవర్గానికే కాదు, సొంత గ్రామానికి సైతం ఏం చేయనివాడు బాబు అన్నారు. కుప్పంలో తాము వచ్చాకే ఇందిరమ్మ ఇళ్లు కట్టించామన్నారు.

కుప్పం ప్రజలు అడిగితేనే ఉచిత విద్యుత్తు యోచన చేశామని అన్నారు. ఉచిత విద్యుత్తు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాలపై చంద్రబాబు అభిప్రాయాలను బాబు రాసిన 'మనసులో మాట' పుస్తకంనుంచి చదివి వినిపించారు. ఆయన వ్యాఖ్యలకు టీడీపీ తీవ్ర నిరసన తెలుపుతూ అడుగడుగునా అడ్డుతగిలింది. అయితే ఈ అంశంపై వాకౌట్‌ చేసిన టీడీపీకి అడ్డుతగిలే అవకాశం లేదని స్పీకర్‌ తెలిపారు.

వాస్తవాలు వినాలంటే ధైర్యం కావాలని... మీకు లక్షలాదిమంది పత్తి రైతులు, వరి రైతులు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని వై.ఎస్‌ అన్నారు. నాగం జనార్థనరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏప్రిల్‌లో నువ్వుగాని నీ వెనుక ఉన్న వాళ్లు గాని ఎవరూ గెలవరని, ఎంతమంది గెలుస్తారో నేనూ చూస్తానని సవాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+