ముంబయి: తాజ్ హోటల్లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్లోని 21వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు రేగటంతో తిరిగి ఏం జరిగిందోనని సిబ్బంది ఆందోళన చెందారు. మంటలు భారీగానే ఎగిసిపడ్డాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.