ఎసిబి వలలో మరో పెద్ద చేప
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో అధికారులపై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ వివేక్ దేశ్‌ముఖ్ ఇంటిపై ఈరోజు ఏసీబీ అధికారులు దాడి చేశారు. వికారాబాద్‌లో ఆయనకు ఉన్న 20 ఎకరాల భూమిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 2 కోట్ల ఆస్తులను గుర్తించారు. తనిఖీ కొనసాగుతోంది.
ఎసిబి అధికారులు మునుపెన్నడూ లేనంతగా దాడులు ముమ్మరం చేశారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో దేవస్థానం ఈఓ రఘునాథ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. విశాఖ, కాకినాడ, అత్తిలిలోని ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications