తిరుమలలో తీవ్ర రద్దీ, ఉద్రిక్తత
తిరుపతి: తిరుమలలో తీవ్ర రద్దీ నెలకొంది. సంవత్సరం చివరలో ఎప్పటిలాగే ఇక్కడ మహా రద్దీ నెలకొంది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉన్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ దాటి 4 కిలోమీటర్ల మేర లైన్లు ఉండటంతో శ్రీవారి దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పడుతోంది. ఈ రద్దీ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
సంవత్సరాంతపు సెలవులు కావడంతో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా తిరుమలలో రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనం ఆలస్యం కావడంతో కోపోద్రిక్తులైన భక్తులు గురువారం రాత్రి క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్ గేట్లను బద్దలు కొట్టారు.












Click it and Unblock the Notifications