గుడిసెల తొలగింపుపై హైకోర్టు స్టే
హైదరాబాద్: భీంరావుబాడ బస్తీలో శనివారం ప్రభుత్వ అధికారులు గుడిసెల కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. బస్తీవాసుల తరలింపు, గుడిసెల కూల్చివేతలు తక్షణం ఆపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.హౌజ్‌మోషన్ ఫిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌ను హైకోర్టు నియమించింది. జనవరి 19లోగా నివేదిక సమర్పించాలని, అప్పటివరకు స్టే ఉంటుందని కోర్టు పేర్కొంది. అడ్వకేట్ కమిషనర్ కె.కెస్.మూర్తి భీంరావబాడను సందర్శిస్తారని కోర్టు తెలిపింది.
గాంధీభవన్ నిర్మాణం కోసం ఈరోజు భీంరావబాడ బస్తీలో ప్రభుత్వ అధికారులు కూల్చివేతలపై నివాసితులు హైకోర్టులో హౌజ్‌మోషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు మధ్యాహ్నం 1-30 గంటలకు విచారణ జరిపి స్టే ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications