ఇస్లామాబాద్: ముంభై ప్రేలుళ్ళ ఫలితంగా బోర్డర్ వద్ద ఉద్రిక్త వాతావరణం..యుధ్ధం వచ్చే అవకాశముందని వార్తలు వెలబడుతున్న నేపధ్యంలో పాక్ ప్రధాని అటువంటిదేమీ లేదన్నట్లు మాట్లాడారు. తాము భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదనీ, తమది శాంతికాముక దేశమని పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ అన్నారు. ముంబై పేలుళ్ల తర్వాత ఉపఖండంలో పెరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని చల్లబరిచేందుకు మిత్రదేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో గిలానీ మాట్లాడుతూ, పొరుగుదేశాలతో స్నేహసంబంధాలనే తాము ఎప్పుడూ కోరుకుంటామని చెప్పారు.