మొద్దుశీను భార్యకు రూ.5 లక్షలు
గుంటూరు: అనంతపురం సబ్ జైలులో మృతి చెందిన మొద్దు శీను భార్య లక్ష్మీరాజ్యంకు రూ.5లక్షలు అందజేయాలని జిల్లా కలెక్టర్ బి వెంకటేశంకు శనివారం రాత్రి ఆదేశాలు అందాయి. మానవ హక్కుల సంఘం శ్రీను భార్యకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొద్దు శీను పరిటాల హత్యకేసులో ప్రధాన నిందితుల్లో ఒకడు. మరో ప్రధాన నిందితుడు మద్దల చెరువు సూరికి సన్నిహితుడు.
ఈమేరకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్, గుంటూరు జిల్లా కలెక్టర్‌కు రూ.5లక్షలు పంపాలని శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. మొద్దు శ్రీను భార్య లక్ష్మీరాజ్యంకు రూ.5లక్షలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరేట్‌కు ఫ్యాక్స్ ద్వారా శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులలో ఈ మొత్తాన్ని లక్ష్మీరాజ్యంకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications