కర్నూలు: రాబోయే కాలంలో తాను సీఎం నవుతానంటూ బాలక్రిష్ణ ప్రకటించడం,ఆ మరుసటి రోజు చంద్రబాబే సీఎం అంటూ మాట మార్చడం సిగ్గుచేటని రాష్ట్ర గిడ్డంగులు, మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప వ్యాఖ్యానించారు. అలాగే బాలకృష్ణ భ్రష్టు పట్టాడని, చంద్రబాబు వేస్టని, ఆయనకు నీతి నియమాలు లేవని..రామ రాజ్యంలో ఏ శక్తి అయినా పతనం కాక తప్పదని మంత్రి మారెప్ప ఎద్దేవా చేశారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆలూరు పట్టణంలో మానవహారం చేపట్టారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్‌దే విజయమన్నారు.