తెలంగాణ విద్యార్థి గర్జన నేడు
హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించతలపెట్టిన తెలంగాణ విద్యార్థి గర్జన సోమవారం సాయంత్రం హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో జరగనుంది. రాబోయే ఎన్నికలకు అవసరమైన సానుకూల వాతావరణాన్ని కల్పించడానికి తెలంగాణ సెంటిమెంట్ రంగరింపజేయడంలో భాగంగా ఈ గర్జనను నిర్వహిస్తున్నారు.
ఈ బహిరంగ సభకు విశిష్ట అతిథిగా ప్రజాగాయకుడు గద్దర్‌తో పాటు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, దేశపతి శ్రీనివాస్, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు హాజరవుతున్నారు. తెలంగాణ పది జిల్లాల నుంచి.. జిల్లాకు 5వేల మందికి తగ్గకుండా సుమారు లక్ష మంది విద్యార్థులు తరలివస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.












Click it and Unblock the Notifications