షిల్లాంగ్: భారత్ ప్రస్తుతం రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోందని,అవి ఆర్థికమాంద్యం, తీవ్రవాదం ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. షిల్లాంగ్‌లో జరుగుతున్న 96వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభించడానికి వచ్చిన ఆయన పాక్ పై మళ్ళీ విమర్శలు గుప్పించారు. భారత్‌కు తీవ్ర ముప్పుగా పరిణమించిన తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి ఎంతటి చర్యలు తీసుకోవడానికైనా తాము సిద్ధమేనని ఆయన అన్నారు. అలాగే పాకిస్థాన్‌పై యుద్ధం చేయడంతోనే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ముంబై పేలుళ్ల రూపకర్తలను పాక్ వెంటనే తమకు అప్పగించాల్సిందేనని ఆయన డిమాండ్ చేసారు.