రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి
కడప: కడప జిల్లాలో ఒకేరోజు సోమవారం నాడు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. పొద్దుటూరు మండలం ఉప్పరపల్లి వద్ద ఆటోను ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో 4గురు మృతి చెందారు. పులివెందులలో 108 అంబులెన్స్‌ను ఆటో ఢీకొనటంతో ముగ్గురు మృతి చెందగా 8మంది గాయపడ్డారు.
వేంపల్లి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ఖాజీపేట మండలం పత్తూరు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మరొకరు మరణించారు.












Click it and Unblock the Notifications