సత్యం: సీఐడి,ఆర్వోసీ సమావేశం
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం సిఐడి ఐజి నేడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ వోసి) అధికారులతో సమావేశమయ్యారు. కార్పొరేట్ మోసాలకు సంబంధించి పోలీసులకు పెద్ద అవగాహన ఉండదు. సత్యం ఫైళ్ళను పరిశీలించిన ఆర్ వోసి అధికారులు జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
ఈ విషయంలో హైదరాబాద్ ఆర్ వోసి అధికారులు నిస్పాక్షికంగా వ్యవహరించారనే చెప్పాలి. నాగార్జున ఫైనాన్స్ మోసాన్ని బయటికి తీయడంలో కూడా హైదరాబాద్ ఆర్వోసీ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి, పోలీసులకు కావలసిన కీలక సమాచారాన్ని అందించారు. అన్ని కంపెనీల జాతకాలు ఆర్వోసీ వద్ద ఉంటాయి.












Click it and Unblock the Notifications