అయ్యప్ప విగ్రహ దొంగ అరెస్టు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పట్టణంలో అయ్యప్ప విగ్రహాన్ని అపహరించిన దొంగను కర్ణాటక రాష్ట్రంలోని యాదగిర్ పట్టణంలో కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. ఆనంద్ అనే వ్యక్తి విగ్రహాన్ని దొంగిలించి కరిగించి యాదగిర్ పట్టణంలో ఓ దుకాణంలో అమ్మే ప్రయత్నంచేశాడు. దుకాణం యజమానులు పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఆంధ్ర పోలీసులకు తెలియజేశారు. నారాయణపేట డిఎస్పీ ఆధ్వర్యంలో ఓ బృందం వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో అయ్యప్ప విగ్రహం చోరీకి గురి కావడం, ఆ సంఘటనపై స్ధానిక ఎంపీ, ఎమ్మేల్యేలు సరిగా ప్రతిస్పందించకపోవడంతో హిందూ మత సంఘాలు ఆందోళన చేశాయి.












Click it and Unblock the Notifications