త్యాగానికి సిద్ధం: నన్నపనేని రాజకుమారి
విజయనగరం: త్యాగాలకు సిద్ధంగా ఉండాలంటూ తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ సీనియర్‌నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. బాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయనతోపాటు వచ్చిన రాజకుమారి విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.
తాను పదవులు ఆశించి పార్టీలోకి రాలేదని, పార్టీ సూచించినట్లు ఆ త్యాగాలేవో తనతోనే మొదలుపెడతానని ఆమె అన్నారు. తనలో సత్తా ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయని చెబుతూ, ఏళ్ల తరబడి వేచి చూశాకే పీవీకి ప్రధాని పదవి దక్కిందన్నారు. అన్ని అర్హతలూ ఉన్నా సోనియాకే ప్రధాని పదవి రాలేదని అన్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా చంద్రగిరి టికెట్ సంపాదించుకున్న నేపధ్యంలో నన్నపనేని కొంత ఢీలా పడినా పైకి గంభీరంగా కన్పించారు.












Click it and Unblock the Notifications