మరో ఇద్దరు సత్యం ఉద్యోగులు అదృశ్యం
హైదరాబాద్: సత్యం కంపెనీలో అవకతవకలు ఎవరి చేతుల మీదుగా జరిగాయో, ఎవరు రామలింగరాజుతో కుమ్మక్కు అయ్యారో వారు ఒకొక్కరుగా అదృశ్యమవుతున్నారు. నిన్న వైఎస్- ప్రెసిడెంట్ (ఫైనాన్స్) రామకృష్ణ, నేడు జీడీకే రాజు, కె. నర్సింహారాజు ఒకరి తర్వాత మరొకరు అదృశ్యమవుతున్నారు. సత్యం మహా మోసంలో రామలింగరాజుకు సహకరించారని సిఐడీ భావిస్తున్న వారంతా మాయమవుతుండటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరినీ సీఐడీ అధికారులే మాయం చేశారంటూ వారి కుటుంబసభ్యులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
ఇలా ఉండగా రామలింగరాజుపై మీడియా సత్యదూరమైన కథనాలు వెలువరిస్తోందంటూ అతని తరఫు న్యాయవాది ఎస్.భరత్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ చానళ్లు, పత్రికల్లో కూడా రామలింగరాజు ప్రతిష్ట దెబ్బతినేలా కథనాలు వస్తున్నాయంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications