రాందేవ్ యోగాకు ఆదరణ
హైదరాబాద్: బాబా రాందేవ్ యోగా తరగతులకు ఈ రోజు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. సాధారణంగా సెలవు రోజనగానే ఆలస్యంగా నిద్రలేచే నగరవాసులు ఈరోజు మాత్రం సెలవైనా చలిఅయినా సరే లెక్కజేయకుండా తెల్లవారుజామునే ఎన్టీఆర్ స్టేడియం వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఇంత హడావుడికి కారణం అక్కడ బాబా రాందేవ్ యోగా శిబిరం ఈరోజునుంచి ప్రారంభం కావటమే. ఈరోజు నుంచి ఆయన ఆధ్వర్యంలో వారంపాటు యోగా సైన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. తొలిరోజే పెద్దసంఖ్యలో ప్రజలు దీనికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications