హైదరాబాద్: 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్టస్రమితికు కేటాయించిన విధంగానే పీఆర్పీకి ఒకే గుర్తు కేటాయించాలని హైకోర్టు తెలిపింది. అందునిమిత్తం పునఃపరిశీలన జరపాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది.మూడు వారాల్లోగా ఎన్నికల కమీషన్ తమ నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు తెలిపింది. దీంతో పీఆర్పీ పార్టీకి కొంత ఊరట లభించింది. పీఆర్పీకి గుర్తు కేటాయింపుపై మూడు వారాల్లోగా కేంద్ర ఎన్నికల సంఘం పీఆర్పీకి ఒకే గుర్తు కేటాయించలేమని తేల్చిచెప్పడంతో ఆ పార్టీ నేత అల్లు అరవింద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇక హైకోర్టు నిర్ణయంపై పీఆర్పీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.