తిరు నిలయంలో మందు విందులు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని లిబర్టీలో గల తిరునిలయంలో అపచారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గెస్ట్ హౌస్ లో నలుగురు వ్యక్తులు రాత్రి తాగి వీరంగం సృష్టించారు. గెస్‌ట హౌజ్‌లో తాగి వేసిన మద్యం బాటిళ్లతో పాటు కండోమ్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. మద్యం సేవించిన తర్వాత వారు అర్థరాత్రి ఇద్దరు సెక్‌స వర్కర్లను గదికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. వీరి విషయంలో గొడవ జరిగిందని చుట్టుపక్కల ప్రజలు తెలిపారు. గెస్‌టహౌజ్‌లో రూం నంబర్ 7, 8 గదుల్లో జరిగింది. రూం నంబర్ 7ను కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న సురేశ్ (చిత్తూరు జిల్లా)పై, రూం నంబర్ 8 కెపీ శ్రీధర్ (చిత్తూర్) పేర్లతో నమోదు చేసుకున్నారు. వీరిని టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడుకి బంధువులుగా భావిస్తున్నారు. ఇటీవల మద్యం వ్యాపారికా దేవస్థానం చైర్మన్ పదవి అని యోగా గురువు రామ్‌దేవ్ ఆదికేశవులు నాయుడిని విమర్శించారు.












Click it and Unblock the Notifications