అంగన్ వాడీల సమ్మె విరమణ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలు తమ సమ్మెను విరమించారు. మంత్రి రాజ్యలక్ష్మితో జరిగిన చర్చలు సఫలం కావడంతో వారు సమ్మెను విరమించారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించేందుకు వేలాదిమంది అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. మంత్రి రాజ్యలక్ష్మి వారిని చర్చలకు ఆహ్వానించారు. చర్చల్లో వారి డిమాండ్లను మంత్రి అంగీకరించారు. 41,42,390 జీఓల ఉపసంహరణకు అంగీకరించారు. చర్చలు సఫలం కావటంతో సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్‌వాడీ కార్యకర్తలసంఘం నేతలు ప్రకటించారు.












Click it and Unblock the Notifications