ప్రతిపక్ష ఎమ్మెల్యేల గెంటివేత
హైదరాబాద్: శాసనసభ నుంచి ప్రతిపక్షాలకు చెందిన 51 మంది శాసనసభ్యులు బుధవార ఉదయం సస్పెన్షన్ కు గురయ్యారు. వారిని ఒక రోజు పాటు స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి సస్పెండ్ చేశారు. సస్పెండైన సభ్యులు సభను వీడి వెళ్లక పోవడంతో వారిని మార్షల్స్ చేత గెంటివేయించారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారంటూ స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్ కు శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య తీర్మానాన్ని ప్రతిపాదించారు. సభ్యుల సస్పెన్షన్ అనంతరం సభ పది నిమిషాల పాటు వాయిదా పడింది.
బుధవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాల సభ్యులు ముఖ్యమంత్రి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన 13 సంస్థల వ్యవహారాలపై తక్షణ చర్చకు అనుమతించాలని కోరుతూ వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి. దాన్ని స్పీకర్ తిరస్కరించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ పట్టు వీడ లేదు. చర్చకు అనుమతించాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా సభా కార్యక్రమాలు కొనసాగకపోవడంతో స్పీకర్ ప్రతిపక్షాల సభ్యులను సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications