అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు శిక్ష!
ప్రముఖ మీడియా సంస్థ తెహల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్ పాల్‌కు బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం కేసులో బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చింది. శిక్షను ఖరారు చేసే ముందు కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం శిక్షను ఖరారు చేసింది. ఇరుపక్షాల వాదనల అనంతరం..2013లో జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం చేసిన కేసులో ఈ తీర్పును వెలువరించింది. న్యాయస్థానం ఆయనకు రెండు సెక్షన్ల కింద 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో సెక్షన్ కింద మూడేళ్ల శిక్ష విధించింది.
దోషిగా నిర్దేశించిన బాంబే హైకోర్టు
2013 నాటి లైంగిక దాడి కేసులో తరుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టు దోషిగా తేల్చింది. తేజ్‌పాల్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ గోవాలోని ట్రయల్ కోర్టు 2021లో ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. 13 ఏళ్లుగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసు, ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత శిక్షను ప్రకటించింది.
కోర్టు ప్రకారం, తేజ్‌పాల్‌కు రెండు సెక్షన్ల కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, మరో సెక్షన్ కింద మూడు సంవత్సరాల శిక్ష విధించారు. అంటే ఈ కేసులో వేర్వేరు నేరాలకు కోర్టు వేర్వేరు శిక్షలు విధించింది.

ఈ కేసు 2013లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్న తరుణ్ తేజ్‌పాల్, గోవాలోని ఒక హోటల్ ఎలివేటర్‌లో తన మహిళా సహోద్యోగిపై లైంగిక దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. తేజ్‌పాల్ ఈ ఆరోపణలను ఖండించారు. సుదీర్ఘ విచారణ అనంతరం, 2021లో గోవాలోని ఓ ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత గోవా ప్రభుత్వం ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఇరుపక్షాల సాక్ష్యాలను వాదనలను పునఃపరిశీలించి, తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారిస్తూ దిగువ కోర్టు నిర్ణయాన్ని ఇప్పుడు రద్దు చేసింది.హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తేజ్‌పాల్ ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల 2013 నుంచి కొనసాగుతున్న ఈ న్యాయపోరాటం ఇంకా ముగియలేదు.




Click it and Unblock the Notifications