జీవిత ఖైదీని చేశారు: చిరు

తనతో 30 ఏళ్ల జీవితంతో ప్రజలు పెనవేసుకుపోయారని, తెరపై తనను చూసి గుండెల్లో ఖైదీని చేశారని ఆయన అన్నారు. ప్రజలతో తనది ఎన్ని జన్మల అనుబంధమో అని ఆయన అన్నారు. శాసనసభలో బుధవారం చోటు చేసుకున్న సంఘటనలపై చిరంజీవి తీవ్రంగా ప్రతిస్పందించారు. సభ్యులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నువ్వు ఇంత తిన్నావంటే, నువ్వు ఇంత తిన్నావని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని, వాటికి ప్రజా సమస్యలు పట్టి లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications