ఎమ్మెల్యేల గెంటివేత: ఉద్రిక్తత
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల మీద మార్షల్స్ దాడి చేశారు. ఈ దాడిలో తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గాయపడడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. వాయిదా తీర్మానాలపై చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకరు ఇందుకు అనుమతించకపోవడంతో వారు పోడియం వద్దకు దూసుకెళ్ళారు. సభ నిర్వహణకు అంతరాయం కావడంతో స్పీకరు వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్ళకపోవడంతో మార్షల్స్ ద్వారా వారిని బయటికి పంపించారు. ఆ క్రమంలో పయ్యావుల కేశవ్ గాయపడ్డారు.
అంతకు ముందు శాసనసభ రెండుసార్లు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. స్పీకర్ ప్రసంగంపై చర్చ, బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్షాలకు బోలెడు సమయం దొరుకుతుందని అనుకున్నది మాట్లాడవచ్చని 9.30 అనంతరం సమయమంతా విపక్షాలదేనని స్పీకర్ అన్నారు. ప్రశ్నోత్తరాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినకపోవటంతో సభను రెండవసారి 15 నిముషాలపాటు వాయిదావేశారు.












Click it and Unblock the Notifications