విశాఖఆర్టీసి బస్సు దోపిడీ
విశాఖపట్నం: భద్రాచలం నుంచి విశాఖపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం దోపిడీకి గురయ్యింది. సీలేరు సమీపంలోని బత్తులూరు వద్ద గుర్తు తెలియని కొందరు దుండగులు బస్సును ఆపి ప్రయాణీకులను మారణాయుధాలతో బెదిరించి, తాము మావోయిస్టులమని చెబుతూ ప్రయాణీకుల వద్ద నుంచి ఆరువేల రూపాయల నగదు, సెల్‌ఫోన్లను దోచుకున్నారు. బంగారం ఆభరణాలు కూడా దోచుకున్నారు. నలుగురు దుండగులు దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. వెళుతూ బస్సు డ్రైవర్ చేతికి ఒక లేఖ ఇచ్చారు. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications