వైఎస్ ఇంత గొప్ప మిమిక్రీ ఆర్టిస్టా?
అనకాపల్లి: బహిరంగ సభల్లో ప్రజలకు సత్వర వైద్యసేవలు అందిస్తున్న 108, 104 అంబులెన్స్ వాహనాల హారన్‌ను అనుసరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ చేస్తున్న మిమిక్రీ (కూత) జనాన్ని ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని గమనించారో ఏమోగాని, ముఖ్యమంత్రి ప్రతి సభలోనూ కచ్చితంగా ఏదో ఒక సందర్భంగా 'కుయ్...కుయ్' అంటూ అంబులెన్స్ హారన్‌ను అనుసరిస్తూ పలుమార్లు అనడం సభలో నవ్వులు కురిపిస్తున్నాయి. శనివారం సబ్బవరం, ఎలమంచిలి సభల్లోనూ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని మర్చిపోలేదు.
ఇటీవల అనకాపల్లి వచ్చిన సందర్భంలో వైఎస్ మిమిక్రీ చేయడం మర్చిపోని ఈ ప్రాంతప్రజలు మళ్లీ అదే కూత కూస్తారేమోనని చర్చించుకుంటూ ఎదురు చూస్తుండగానే వైఎస్ హారన్ కూత కూయడంతో జనం కడుపుబ్బా నవ్వారు. తన ప్రసంగంలో హాస్యాన్ని పండించడానికి ఈ విధంగా అంటున్నారా.... లేక ఇదేమైనా సెంట్‌మెంట్ అంశమా అన్నది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications