కడప: ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినీ సంగీత మాంత్రికుడు అల్లా రఖా రెహ్మాన్ గురువారం అర్ధరాత్రి కడప జిల్లాలోని ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. సాధారణంగా రెహ్మాన్ ఏ పని ప్రారంభించాలన్నా..ఏ కొత్త ఆల్బమ్ విడుదల చేయాలన్నా ఈ దర్గాలో పూజలు చేస్తూంటారు. అయితే ఈ సారి రెహ్మాన్ ప్రపంచ వేదికపై ఆస్కార్ అవార్డులు అందుకొన్న తొలి భారతదేశ వాసిగా కీర్తి పతాకను ఎగురవేసి తాను అత్యంత భక్తి ప్రపత్తులతో పూజించే అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. అమీన్ పీర్ దర్గాలో రెహ్మాన్ ప్రత్యేక ప్రార్ధనలు చేసిన తరువాత తన ఆధ్యాత్మిక గురువైన బాబా ఆశీస్సులు తీసుకున్నారు.