ప్రజారాజ్యం క్షమాపణ
హైదరాబాద్: తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజాపై మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి చేసిన వ్యాఖ్యలపై పీఆర్పీ విచారం వెలిబుచ్చింది. వ్యక్తిగత దూషణలకు తాము వ్యతిరేకమని పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రా స్పష్టం చేశారు. శోభారాణిని ఆ విధంగా మాట్లాడమని పార్టీనుంచి ఎలాంటి ఆదేశాలు లేవని మిత్రా అన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు చిరంజీవే చర్య తీసుకుంటారని ఆయన తెలిపారు.
ఇక మీదట పరస్పరం నిందారోపణలకు పాల్పడ వద్దని నిన్ననే చిరంజీవి శోభారాణి వంటి వారికి సూచించారు. అయితే రోజా తమ కుటుంబ సభ్యుల మీద ఎప్పటి నుంచో వ్యక్తిగత విమర్శలు చేస్తోందని చిరంజీవి గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications