ఇస్లామాబాద్: పాక్‌లో శ్రీలంక ఆటగాళ్లపై ఈరోజు గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులు జరిపాడు. దాడికి పాల్పడ్డారు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వద్ద ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఈరోజు పాక్, శ్రీలంకల మధ్య క్రికెట్‌మ్యాచ్ జరగాల్సిఉంది. స్టేడియం వద్దకు బస్సులో ఆటగాళ్లు వచ్చారు. వారు దిగుతుండగానే గుర్తు తెలియని వ్యక్తి వారిపై కాల్పులు జరిపారు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇరువైపులా జరిగిన కాల్పుల్లో 5గురు సెక్యూరిటీ పోలీసులు మృతి చెందగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. ఇందులో సంగక్కర, సమరవీర, అజంత మెండీస్, తరంగ, మహేళ జయవర్థనే, మురళీధరన్ ఉన్నట్లు తెలుస్తోంది.