మళ్ళీ అరవింద్ భూ వివాదం

ఆ స్థలం తమదేనని, దాంట్లోకి అల్లు అరవింద్ కుటుంబసభ్యులు అన్యాయంగా ప్రవేశించారని రాహుల్‌దేవ్ కౌంటర్ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగ్ పోలీసులు రెండు పక్షాలపైనా కేసులు నమోదు చేశారు. ఎవరి భూమి ఎంత అనే సర్వే నిర్వహించాలని కోరుతూ సీఐ రవిచందన్‌రెడ్డి రాజేంద్రనగర్ తహశీల్దార్‌ను కోరగా రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. స్థలాల పత్రాలను, పహాణిలను క్రయవిక్రయదారుల వివరాలను తహశీల్దార్ పోలీసుస్టేషన్‌కు పంపించారు. దీనిపై సీఐని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా రెవెన్యూ అధికారుల నుంచి పత్రాలు వచ్చాయని చెప్పారు.
ఇక ఏ సర్వేనెంబర్లో ఎవరికి ఎంత భూమి ఉంది, ఏ భూమి ఎవరు తీసుకోవాలనే విషయాన్ని ఇరువర్గాలు కోర్టులో తేల్చుకోవాలని, కోర్టు నిర్ణయం ప్రకారం ఎవరి భూమి వారు తీసుకోవాలన్నారు. ఇక ఈ సమయంలో న్యాయవాది రాహుల్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ..అవినీతిరహిత సమాజం స్థాపిస్తామంటున్న చిరంజీవికి వారి కుటుంబసభ్యుల అవినీతి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications