అమ్మకే అన్నం పెట్టని: వై.ఎస్‌

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారుగాజులు చేయిస్తానన్నట్లు ఉందని..చంద్రబాబు వాగ్ధానాలను తీవ్రస్దాయిలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్లు పదవిలో ఉండి సామాన్యులనే పట్టించుకోని బాబు ఈరోజు వారికి చేస్తున్న వాగ్థానాలు చేయటం విచారకరమని అన్నారు. అలాగే రెండు రూపాయలకు కిలోబియ్యం, సంపూర్ణ మద్యనిషేధం అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ తరువాత ఏం చేసిందో అందరికీ తెలుసని సీఎం అన్నారు.

అధికారంకోసం తీవ్ర అసహనంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిచ్చి పిచ్చి వాగ్థానాలు చేస్తున్నారని తాము అలాంటివి చేయమని వైయస్ అన్నారు. తాము గతంలో వాగ్థానాలు చేసినప్పుడు అమలుచేయగలిగేవే చేశామని, అన్నిటిని నిలబెట్టుకున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన వాగ్థానాలు ఆచరణ సాధ్యం కావని అన్నారు. ఎస్సీల వర్గీకరణ రాజ్యాంగపరిధిలోని అంశమని తన ఇష్టానుసారం చేసేయలేమని అన్నారు. అందుకే ఉషామెహ్రా కమిషన్‌ వేశామని, ఇంకా ఏం చేయగలమని ఆలోచిస్తున్నామని వై.ఎస్‌ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+