కాంగ్రెస్ గెలుపు కల్ల: సిపిఐ
హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ కలలు కల్లలు కాక తప్పదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ అన్నారు. హైదరాబాద్‌లో ఏఐఎస్‌ఎఫ్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతిపాలనతో ప్రజలు విసిగిపోతున్నారని ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు. తృతీయ ఫ్రంట్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న భాజపా నేత వెంకయ్యనాయుడు తన నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications