పవన్ పెళ్లి నా వల్లే:రోజా

వైయస్ తన ముద్దుల కొడుక్కి కోట్ల విలువైన ప్రజల సొమ్ము దోచిపెట్టి, ప్రజలకు మాత్రం ఉత్తుత్తి ముద్దులు విసురుతున్నారని దీనికన్నా అన్యాయం మరోటి ఉండదని రోజా అన్నారు. శనివారం ఏలూరు రోడ్‌షోలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆలీబాబా 40 దొంగల్లా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ మంత్రులు దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కమీషన్ల కోసమే కొత్తకొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. పథకాలు లేకపోతే ప్రజలను దోచుకోవడం కష్టమవుతుందని గుర్తించి అర్థం లేని పథకాలకు ప్రభుత్వం అంకురార్పణ చేస్తోందని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications