ఆ తర్వాత ఎన్టీఆర్ అనాధే: పీఆర్పీ
హైదరాబాద్: ఎన్నికల తర్వాత అనాధగా మిగులుతావని ఎన్టీఆర్‌ను పీఆర్పీ మహిళారాజ్యం అధ్యక్ష్యురాలు శోభారాణి హెచ్చరించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ చిట్టెలుక వంటివాడని ఆమె విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి వంగా గీత, శోభారాణి, పద్మ మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఒక ముస్లిం మైనారిటీ అని తెలిసింది. టీడీపీ ఆయన్ను తీసుకురావడం ద్వారా మేం చెబుతున్న సామాజిక న్యాయం గెలిచింది. ఎన్టీఆర్‌ను తీసుకురావడం వెనుక పరోక్షంగా మా ఒత్తిడి ఉంది అని శోభారాణి వ్యాఖ్యానించారు. చిరంజీవిని విమర్శించే స్థాయి ఎన్టీఆర్‌కు లేదన్నారు.
అనంతరం పీఆర్పీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ తన పేరులోనే 'జూనియర్' ఉందన్న విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ మరచిపోవద్దని అన్నారు. చెట్టు పేరు చెప్పందే కాయలమ్మలేని, తాత పేరు చెప్పందే తొడగొట్టలేని వాడంటూ ఎద్దే వా చేశారు. చంద్రబాబు చేతిలో పావుగా మారారని, కెరీర్ మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ దానికి ప్రతిఫలం చూస్తారని అన్నారు.'పడికట్టు పదాలు, ప్రాసలతో కూడిన ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ఓట్లు రాలవు. రాజకీయాలు మారిపోయాయి బిడ్డా' అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications