తెరాస,టిడిపి చర్చలు: సీట్ల పీట ముడి
హైదరాబాద్: సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య సీట్ల సర్దుబాటులో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు సోమవారం రాత్రి తెరాస సంకేతాలు అందించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం, తెరాసల మధ్య సోమవారం జరిగిన చర్చలు విజయవంతం కాలేదు. తెరాస 51 శాసనసభా స్థానాలు అడుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పొత్తు తెగుతుందా, ఉంటుందా అనే విషయాన్ని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications