ఎన్టీఆర్ ఆరోగ్యమే ముఖ్యం: బాబు
హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కంటే జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం ముఖ్యమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి ఐసియులో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో ఒక నిముషం మాట్లాడారు. విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎన్టీఆర్ ను ఉగాదికి హైదరాబాద్ వచ్చి కొన్ని రోజుల విశ్రాంతి తీసుకోమని తానే సలహా ఇచ్చానని చంద్రబాబు అన్నారు.
తన మాట విని ఎన్టీఆర్ హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరగడం దురదృష్టకరమని తెలిపారు. ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా నిర్వహించాడని, ఇలా జరగడం బాధాకరమని చెప్పారు. పార్టీకి లాభమా నష్టమా అన్నది కాదని, ఆయన ఆరోగ్యమే అన్నిటికంటే తమకు ముఖ్యమని అన్నారు.












Click it and Unblock the Notifications