పాక్ లో దాడి: 70 మందికి పైగా మృతి
పెషావర్: పాకిస్తాన్ లో ప్రార్థనా మందిరంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 70 మంది దాకా మరణించారు. దాదాపు రెండు డజన్ల మంది గాయపడ్డారు. అఫ్షాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న జమ్రుద్ లోని మసీదులో ఆ పేలుడు సంభవించింది. ఆత్మాహుతి దాడి నుంచి ఎవరైనా బయట పడి ఉంటారా అని పోలీసులు అన్వేషిస్తున్నారు. పేలుడులో 80 మందికి పైగా మరణించి ఉంటారని, 23 మంది దాకా గాయపడి ఉంటారని పాకిస్తాన్ అధికారి మొహ్మద్ బషీర్ చెప్పారు. పాకిస్తాన్ లోని వాయవ్య దిశలో రోజురోజుకూ పెరుగుతున్న దాడుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. తాలిబాన్, ఆల్ ఖైదాలే ఈ దాడులకు కారణమని అనుమానిస్తున్నారు. జమ్రుద్ ఖైబర్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ గిరిజన, మిలిటెంటు గ్రూపులు పని చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications