జనం మధ్య చిరు ఉగాది సంబరం
జగ్గంపేట : ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విరోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను జనం మధ్యలో జరుపుకున్నారు. ఆయన సంప్రదాయ తెలుగు దుస్తులు ధరించి చాలా ఉల్లాసంగా కన్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన జగ్గంపేట జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని పంచాంగ పఠనాన్ని విన్నారు. అనంతరం పీఆర్పీ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేశారు. జనం మధ్యలో జాబిత విడుదల చేయడం ఇదే తొలి సారి అని, ఇక్కడి నుంచి మార్పును మొదలు పెడుతామని చిరంజీవి చెప్పారు.












Click it and Unblock the Notifications