ఎన్టీఆర్ తల్లికి చిరు ఫోన్ పరామర్శ
హైదరాబాద్: ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఆకాంక్షిస్తున్నారు. ఎన్టీఆర్ తల్లితో చిరు ఫోన్‌లో మాట్లాడి ఎన్టీఆర్ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంతో ఎన్టీఆర్‌కు దిష్టిపోతుందని చిరంజీవి అన్నారు.
ఇలాఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ కోలుకుంటున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల్ని, సన్నిహితుల్ని గుర్తు పడుతున్నట్లు కిమ్‌స వైద్యుడు భాస్కరరావు తెలిపారు. రెండు మూడు వారాల్లో ఎన్టీఆర్ తన పనులు చేసుకోవచ్చిని తెలిపారు. మరో 2-3 గంటల్లో ఆయన ఆహారం కూడా తీసుకుంటారని చెప్పారు. వెన్నపూసకు గాయం అయినందునే ఎన్టీఆర్‌ను ఆసుపత్రిలో ఉంచుకున్నామని లేకుంటే ఇప్పటికే ఇంటికి పంపేవారమని చెప్పారు.












Click it and Unblock the Notifications