ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూజలు, యాగాలు
హైదరాబాద్: ఎన్టీఆర్ కు చికిత్స జరుగుతున్న కిమ్స్ ఆస్పత్రికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. కొబ్బరి కాయలు కొడుతున్నారు. కడప జిల్లా పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీఆర్ అరోగ్యం కోసం టిడిపి నాయకులు యాగం చేస్తున్నారు.
ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నానని డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని స్వయంగా డాక్టర్ అయిన దగ్గుబాటి అన్నారు. భగవంతుడి దయ, అభిమానుల ప్రేమతో ఎన్టీఆర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారని టిడిపి నాయకురాలు నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. మోహన్ బాబు, పరుచూరి వెంకటేశ్వరావు కూడా ఎన్టీఆర్ ను పరామర్శించారు.












Click it and Unblock the Notifications