ఎన్టీఅర్ పై పోలీసు కేసు

నల్గొండ: వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని టీడీపీ నేత ఎన్టీఆర్‌పై కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలోని మోతె పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి ఖమ్మం జిల్లా రోడ్‌షోలో పాల్గొని రెండు-మూడు రోజులు విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్టీఆర్‌తో పాటు ఆయన అసిస్టెంట్‌ రాము కూడా గాయపడ్డారు.

అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎన్టీఆర్ డ్రైవింగ్ చేయలేదని ఆయన మిత్రులు చెబుతున్నారు. ఆ సమయంలో డ్రైవర్ సీట్లో మరొకరు ఉన్నారని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ డ్రైవింగ్ సీట్లో ఉన్నందువల్లనే ఆయన నుదుటికి స్టీరింగ్ ద్వారా గాయాలయ్యాయని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+