వంద మందితో ప్రజారాజ్యం జాబితా
జగ్గంపేట : రాష్ట్ర విధానసభ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విడుదల చేశారు. మొదటి విడతగా వంద స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశామని ఆయన వెల్లడించారు. మిగిలిన అభ్యర్థుల పేర్లను సాయంత్రం హైదరాబాద్‌లో ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు.తిరుపతి స్థానంనుంచి చిరంజీవి పోటీ చేస్తారని పార్టీ సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య ప్రకటించారు
ప్రజారాజ్యం పార్టీ నాయకుడు దేవేందర్‌గౌడ్ మల్కాజ్‌గిరినుంచి లోక్‌సభ బరిలో దిగనున్నారు.ప్రజారాజ్యం తొలివిడతగా రాష్ట్రంలోని తొమ్మిది లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన జాబితాలో అభ్యర్థులు :జహీరాబాద్-శివకుమార్ లింగాయత్, వరంగల్-డాక్టర్ రాజమౌళి, మహబూబాబాద్- డీటీ నాయక్, శ్రీకాకుళం-కల్యాణి, హైదరాబాద్-ఫాతిమా, అరకు-ఎన్.సింహాచలం, ఆదిలాబాద్-నాగారావు, కరీంనగర్-రాజేందర్












Click it and Unblock the Notifications